Pages

20111014

శ్రీ రంగపట్టణం - క్రిష్ణసాగర్ డాం - మైసూరు - సోమనతపూర్

బెంగుళూరు నుంచి మైసూరు వెళ్దాం అని అనుకుని, కావేరి సన్నిధి రిసార్ట్ లో ఒక రూం తీసుకున్నాం. బెంగుళూరు నుంచి మైసూరు హైవే, బావుంటుంది. ఉదయం ఆరింటికి బయల్దేరాము. బిదడి దెగ్గర మొదటి హాల్టు అనుకుని అలాగే ఆగాము. అక్కడ దొరికే బిదడి బిసి తట్టే ఇడ్లీ, చాల బావుంది. అది తినేసి మరల బయల్దేరాము. ఈసారి హాల్టు మండ్య. అక్కడనుంచి శ్రీ రంగాపట్టణం.  అప్పటికి సమాయం, పదిగంటలయ్యింది. అక్కడ శ్రీ రంగనాథ స్వామి గుడికి వెళ్లి, అక్కడనుంచి కలోనేల్ డన్జాన్స్, తరవాత జమ్మ మసీదు, చూసుకుని, రిసార్ట్ కి వెళ్ళాం. ఆ రిసార్ట్ కి ఆనుకుని కావేరి నది పాయ ఒకటి ఉంది. మధ్యాన్నం అంత ఆ నది వడ్డున సమయం గడిపి, తరవాత దేగ్గర్లోనే ఉన్న, గార్డెన్ హౌస్, సంగం. చూసుకుని బృందావనం(కృష్ణ సాగర్ డాం) కి బయల్దేరాము .














































c

20110518

హోగేనక్కల్

  బెంగళూరు నుండి సుమారు 140 కి.మీల దూరం లో తమిళనాడు రాష్ట్రం లో ఉంది.
ఇక్కడ కావేరి నది, కర్ణాటకకు  తమిళనాడుకు మధ్యన ప్రవహిస్తుంటుంది. 

ఇక్కడ జలపాతం చాల బావుంది. చాల సినిమాలు చిత్రీకరణ చేస్తుంటారు. చివరగా విలన్ చిత్రం ఇక్కడ తీసారట. 

ఇక్కడ చాపలు పట్టి అక్కడికక్కడే వందిపెడతారు.. చాల రుచికరంగా  :) బొబ్బట్లు అమ్ముతూ ఉంటారు ఆకదక్కడా... చాల బావున్నాయి :)

అక్కడ తెడ్డులో జలపాతాలు చూపించడానికి మనుషులు ఉంటారు. సుమారు ఒక గంట తిప్పుతారు.  





























అక్కడకి వెళ్ళే దారులో మాకు ఒక కొండ మీద గుడి కనబడింది. తిరిగి బెంగళూరు కి వచ్చేతప్పుడు స్వామి ని దర్సనం చేసుకుందాం అని కస్టపడి కొండ ఎక్కాము. కాని స్వామి వారి దర్సనం కుదరలేదు. ఆ గుడి సోమ, శుక్రవారాలు మాత్రమె తీస్తారట..అక్కడ నుంచి తీసిన కొన్ని చిత్రాలు. నాకైతేయ్ చాల నచ్చింది ఆ కొండా, ఆ గుడి :)