ఈరోజు ఆఫీసు నుంచి ఇంటికి వద్దాం అనుకునే లోపు ఇలా వర్షం మొదలయ్యింది. బయల్దేరుతుంటే, మా ఆఫీసు సెక్యూరిటీ గార్డు వర్షం లో ఎం తడిసి పోతావ్ సార్ అన్నాడు. సర్లే అని మళ్ళీ తిరిగి మా ల్యాబ్ కి వెళ్ళాను, సరిగా అదే టైం కి ఇలా ఈ అద్దం మీద వాన చుక్కలు చూసి, చిన్న నాటి జ్ఞాపకాల్లోకి అలా జారుకున్నాను. వర్షం జల్లు కొడుతుంది కిటికీ తలుపులు వేసేయి అంటున్న అమ్మ మాటను వినకుండా చేతులు కిటికీ లోంచి బయటకి పెట్టి ఆడుకున్న రోజు గుర్తుకు వచ్చింది. మల్లి అలా చెయ్యి బయటకి పెట్టి ఆదికోవాలని అనిపించింది. ఇప్పుడు అది కుదరదు కదా అనుకుని ఇలా నా కామెర తీసి ఆ అద్దం మీద చిరుజల్లుని ఇలా బందించాను :)
0 comments:
Post a Comment