Pages

20100923

యెర్కాడ్(yercaud)


శేలం నుంచి 30 కి.మి.ల దూరం లొ ఉంది యెర్కాడ్. యెర్కాడ్ ని పూర్ మాన్స్ ఊటి అని కుడా అంటారు.
యెర్ఖాడ్ కి 10 కి.మి.ల దూరంలో  చిన్న చిన్న గ్రామలు ఉన్నయి. ఆ గ్రామలా మధ్యలొ ఒక మామిడి తోటలో మా బస. అక్కద నిశబ్దం బరించలేక పొయాము. చాలా బయంకరంగా అనిపించినా కొద్ది సెపటికే చాల ప్రశాంతంగా అనిపించింది. రాత్రి పడుకున్నప్పుదు, పురుగుల శబ్దాలు, పక్కనె కొంద కిందన ఉన్న సెలయెరు చప్పుడు, వింటూ అలానే నిద్రలొకి జరిపొయాం. ఉదయం మెలుకువ రాగానె, పక్షుల కిలకిలా రాగాలు, చల్లటి గాలి, వెచ్చని సుర్యుడు మరుపురాని అనుభుతిని మిగిల్చాయి.

అక్కడ నుంచి ఆ సెలయెరు దెగ్గరకు వెల్లడానికి ఒక కత్తి తీసుకుని మార్గం ఎర్పరచుకుంటూ కిందకి దిగాం. ఆ నీటిని చూదగానె మా ఆనందానికి అవదుల్లేవు. నేను  ఇక్కడ ఇంకో విషయం గమనించింది ఏంటి అంటే, ఒక్క ప్లస్తిచ్ కవరు కూడ ఆ మార్గం వెంట చుడలేదు. 

ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక ప్రదెసానికి అపుడప్పుడు వెలుతూ ఉంటే పట్నాల్లొ ఏం కొల్పొతున్నమో తెలుస్తుంది. 





























20100920

నంది హిల్స్